తెల్లవారుజామున

రోజూ ఉదయం 7 గంటలకు ఫినిష్ చేయాల్సిన 7 ముఖ్యమైన పనులివే

Md. Abdul Rehaman
May 07,2024
';

7 ముఖ్యమైన పనులు

రోజూ ఉదయం లేవడం వల్ల లాభాలున్నాయి. రోజూ ఉదయం లేవడం ఒక్కటే కాదు ఆ విలువైన సమయాన్ని వృధా చేయకుండా 7 ముఖ్యమైన పనులకు కేటాయించాలి. అప్పుడే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయి

';

బాడీ హైడ్రేట్

రాత్రి పడుకున్న తరువాత శరీరం సహజంగానే డీహైడ్రేట్ అుతుంది. అందుకే ఉదయం లేవగానే ముందుగా నీళ్లు తాగాలి. ఫలితంగా శరీరం మెటబోలిజం వృద్ధి, హైడ్రేట్ జరుగుతాయి. వ్యర్ధ పదార్ధాలు బయటకు తొలగుతాయి.

';

డిజిటల్ డీటాక్స్

డీటాక్స్ అనేది శరీరానికే కాదు మనం వినియోగించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కూడా. రోజూ ఉదయం లేవగానే కనీసం రెండు గంటల వరకూ మొబైల్ ఫోన్ ముట్టుకోకుండా ఉంటే మంచిది.ఈ సమయాన్ని ఆ రోజంజా ఏం చేయాలనేదానిపై పాజిటివ్ దృక్పధంతో ఉండండి.

';

వర్కవుట్స్

తేలికపాటి నడక లేదా యోగా వర్కవుట్స్ ఏదైనా సరే ఉదయం లేవగానే చేయడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా రక్త ప్రసరణ, ఎనర్జీ మెరుగుపడుతుంది. ఉదయం ఎక్సర్‌సైజ్ అనేది మూడ్ సరిచేస్తుంది.

';

మెడిటేషన్

ఉదయం వేళ మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఫోకస్ పెరుగుతుంది. రోజూ కొన్ని నిమిషాలు మెడిటేషన్ వల్ల పాజిటివ్ ఆలోచనలు, మానసిక ఆరోగ్యం కలుగుతాయి.

';

మెదడుకు మేత

ఫిక్షన్ , నాన్ ఫిక్షన్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇలా ఏదైనా విషయ పరిజ్ఞానం కలిగిన పుస్తకాలు ఉదయం కాస్సేపు చదవడం మంచిది. అన్నింటికంటే మంచిది ఉదయం లేవగానే ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే మరింత మంచిది

';

VIEW ALL

Read Next Story