ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి.. మరి అందుకోసం తీసుకోవలసిన ఒక స్పెషల్ డ్రింక్ ఏమిటో ఈరోజు చూద్దాం
ముందుగా గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి.
ఆ గోరువెచ్చటి నీతిలో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే అందులో ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి.
ఇక అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి.
కుదిరితే ఈ నీళ్లు ఒక ఫ్లాక్కులో పోసి పెట్టుకుని రెండు మూడు గంటల వ్యవధిలో తాగుతూ ఉండండి
ఇలా ఆగి ఆగి కొన్ని గంటల పాటు ఆ నీటిని తాగడం వల్ల మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోతాయి.
రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈ నీరు తాగుతా ఉన్నప్పుడు.. ఒక అరగంట తర్వాత వరకు భోజనం చేయకండి.