ప్రస్తుత తరం వారి జీవనశైలిలో బరువు మెయింటైన్ చేయడమనేది ఎంతోమందికి పెద్ద సమస్యగా మారుతుంది
ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలి అనుకుంటారు కానీ అందుకు తగిన శ్రమ మాత్రం పడలేక పోతుంటారు
ముఖ్యంగా చాలామంది జిమ్ముకి వెళ్లి మరి వ్యాయామాలు చేయాలంటే భయపడుతుంటారు.. అందుకు ముఖ్య కారణం జిమ్ కి వెళ్ళొచ్చే అంత టైం దొరక్క పోవడం. అలాంటివారు ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు జిమ్ కి ..వెళ్లకుండానే తగ్గొచ్చు..
ఇంట్లో అలానే మీరు పని చేసే దగ్గర మెట్లు ఎక్కి దిగుతూఉండండి. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ లిఫ్ట్ ను వాడకుండా.. ఎక్కి దిగడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు మంచి వ్యాయామంలా కూడా ఉంటుంది.
ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ స్కిప్పింగ్ చేయడం అన్నిటికన్నా మంచి పని. చిన్నగా మొదలుపెట్టి స్కిప్పింగ్ కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి.. జిమ్ కి వెళ్లడం కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది..
లెగ్స్ అఫ్ ది వాల్ ఎక్ససైజ్ కొన్ని ఉంటాయి. అవి ఎంతో సులభంగా ఖాళీ టైంలో ఇంట్లోనే చేసుకోవచ్చు.. అవి చేసుకుంటే తొడల్లో ఉండే బరువు త్వరగా తగ్గుతుంది.
ఇంట్లో ఎంచక్కా టీవీలో పాటలు పెట్టుకుని అప్పుడప్పుడు డాన్స్ వేస్తూ ఉండండి. ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు మీ సొంతమవుతాయి