ఉదయాన్నే అల్పాహారంలో జీరా రైస్ తీసుకుంటే ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు. మరి దాని తయారీ విధానం మీకోసం
ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యి వేసి అందులో 2 యాలకులు, 2 లవంగాలు, 2 పలావ్ ఆకులు, రేకులు వేసి వేయించాలి.
వాటితో పాటు 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, జీలకర్ర వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు బియ్యం వేసి 1 నిమిషం వేయించాలి. ఆ తరువాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు వచ్చేలా కొలత ప్రకారం వాటర్ పోయాలి.
అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 5 నుండి 20 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
దీని తరువాత మూత తీసివేసి కాసేపు జీలకర్ర బియ్యాన్ని బాగా కలపండి. తర్వాత ఉడికించాలి.
అంతే ఎంతో రుచికరమైన జీలకర్ర రైస్ రెడీ.