మీ పిల్లలకు రోజు నీరు ఎంత తాగించాలి..? ఈ విషయాలు తెలుసుకోండి..!

Ashok Krindinti
Jun 11,2024
';

పిల్లలకు రోజు ఎంత నీరు తాగించాలి..? అనే విషయంపై ఆస్ట్రేలియాలోని నార్మన్ గార్డెన్స్‌లోని 'బల్లారట్ క్లారెండన్ కాలేజ్' ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

';

4 నుంచి 8 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ప్రతిరోజూ 1.2 లీటర్ల నీరు తాగాలని అధ్యయనం వెల్లడించింది.

';

9 నుంచి 13 సంవత్సరాల వయస్సు ఉన్న అబ్బాయిలు 1.6 లీటర్ల నీరు తాగాలని.. అమ్మాయిలు 1.4 లీటర్ల నీరు తాగాలని సూచించింది.

';

14 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలు 1.9 లీటర్ల నీరు తాగాలని.. అమ్మాయిలు 1.6 లీటర్ల నీరు తాగాలని తెలిపింది.

';

పిల్లలకు ప్రతిరోజూ సరైన మోతాదులో నీరు తాగించాలని సూచించింది. లేకపోతే డీహైడ్రేషన్ కారణంగా మెదడు సరిగా పనిచేయదని హెచ్చరించింది.

';

ఏకాగ్రత లేకపోతే పిల్లలు చిరాకు పడతారు. అంతేకాకుండా బద్ధకం పెరిగిపోయి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

';

ఉదయం లేచిన వెంటనే స్కూలుకు వెళ్లే పిల్లలు తాగాలని.. దీని వల్ల మెదడు మరింత చురుగ్గా పని చేస్తుందని రీసెర్చ్‌లో తేలింది.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం పాటించే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story