స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి
ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే పాన్ లో శనగపప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి
ఇప్పుడు నువ్వులు, ఎండు ఎండుమిర్చి కరివేపాకు, ఇంగువ కూడా నూనెలో వేసి వేయించుకోవాలి
వీటన్నిటిని మిక్సర్ లో వేసుకొని బరకగా లేదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మిశ్రమానికి మిక్సీలోనే ఉప్పు వేసుకొని రుచి సరి చూసుకోవాలి.
ఈ మసాలాను ఒక సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.
మీకు కావాలంటే ఇందులో కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుంది.
నువ్వుల నూనెతో లేకపోతే నెయ్యితో ఈ మసాలా వేసుకొని ఇడ్లీ దోశలు తింటే రుచి అదిరిపోతుంది