రవ్వని, పోహా రెండిటినీ సమపాళ్లలో మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా నీరు వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా చక్కెర, అరకప్పు పెరుగు వేసి కాసేపు నానబెట్టాలి.
అప్పం బ్యాటర్‌కు సరిపోయే నీరు పోసి బాగా కలుపుకోవాలి.
ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి.
ఇందులో ఈనో కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత అప్పం పిండి కాస్త ఎదుగుతుంది.
పిండిని స్టవ్ ఆన్ చేసి వేడి వేడి తవ్వా పై అప్పం పోసుకోవాలి.
ఈ అప్పం కొబ్బరి చట్నీ, టమాటా చట్నీలతో తీసుకుంటే రుచి అదిరిపోద్ది.