సాధారణంగా సీలింగ్ ఫాన్ తిరగడానికి.. దాదాపు 60 నిమిషాలకు 50 పైసలు ఖర్చు అయితే.. ఎయిర్ కండిషనర్ గంట పని చేయడానికి ఆరు నుండి ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది.
అందుకే ఏసీ వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.
సాధారణంగా ఏసిని 22 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పెట్టుకుంటే.. ప్రతి అదనపు డిగ్రీకి 3 నుండి 5 శాతం విద్యుత్ మనం సేవ్ చేసుకోవచ్చు.
అందుకే ఏసిని 24 లేదా 25 డిగ్రీ కి ఫిక్స్ చేసుకోవడం ఉత్తమమైన పని.
అంతేకాదు ముఖ్యంగా ఏసీ ని 24 లో పెట్టి.. గదిలో ఫాన్ కూడా వేస్తే.. త్వరగా రూమ్ మొత్తం చల్లబడి విద్యుత్ వినియోగం తగ్గిపోతుంది.
ముఖ్యంగా ఏసీ ని ఎప్పుడు కూడా 18 డిగ్రీల కన్నా తక్కువగా పెట్టుకోకూడదు.
ఇలాంటి చిన్న చిట్కాలు పాటించడం ద్వారా.. ఏసీ బిల్ తక్కువ మొఖం పట్టడం ఖాయం..