భారతీయులకు అత్యంత ఇష్టమైనది టీ. మరి టీ తాగితే నల్లబడతారా, ఇందులో నిజం ఉందా లేదా..
టీ అదే పనిగా రోజూ తాగడం వల్ల శరీరం రంగు నల్లబడుతుందని అంటుంటారు
అయితే ఈ వాదనకు ఎలాంటి ఆధారం లేదు. టీ చర్మానికి మంచిదని ప్రయోజనకరమని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
చర్మం రంగు అనేది జెనెటిక్ కారణంతో పాటు రోజూ ఎండలో ఎంతసేపుంటారనే దానిపై ఆధారపడుతుంది.
ఆహారపు అలవాట్లు చర్మం రంగును ప్రభావితం చేస్తాయి. అయితే తెల్లగా ఉండేవాళ్లు నల్లబడిపోయేంతగా ఉండదు
అయితే వేడి వేడి టీ ఎక్కువగా తాగడం వల్ల పెదాల పిగ్మంటేషన్ మారుతుంది. సిగరెట్ తాగడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది.
టీతో కలిగే నష్టాలకు శరీరం రంగు నల్లబడటానికి ఎలాంటి సంబంధం లేదు
పాల టీతో హార్ట్ రేట్ పెరగడంతో పాటు ఆందోళన, జీర్ణక్రియ సమస్యలుంటాయి. అందుకే టీ ఎక్కువగా తాగకూడదు
పాల టీ కంటే బ్లాక్ టీ లేదా షుగర్ లెస్ టీ తాగడం అన్నివిధాలుగా మంచిది