వేసవిలో వివిధ రకాల వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే రోజూ పుదీనా నీళ్లు తప్పకుండా తాగాలి.
వేసవి కాలంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, ఎనర్జెటిక్‌గా ఉండటం అవసరం
వేసవి కాలంలో శరీరం హైడ్రేట్‌గా ఉండేందుకు, వ్యాధుల్నించి దూరంగా ఉండేందుకు పుదీనా నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.
పుదీనా నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
పుదీనా నీళ్లలో ఫోలేట్, కాల్షియం, కెరోటిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
రోజూ ఒక గ్లాసు పుదీనా నీళ్లు తాగడం వల్ల లూ వంటి జ్వరాలు కూడా దూరమౌతాయి.
ముఖంపై కాంతిని పెంచేందుకు పుదీనా నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఎసిడిటీ, కడుపులో మంట, ఛాతీలో మంట వంటి సమస్యల్ని దూరం చేసేందుకు పుదీనా నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.