పాలకూర పప్పు తయారీ కోసం.. రెండు గంటల ముందుగా.. ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి.
అవి నానిన తర్వాత.. ఆ రెండు పప్పులను ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని.. పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి.. కొద్దిగా నూనె వేసి.. కొంచెం జీలకర్ర, పావు స్పూన్ ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి.
అభి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం.. తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత.. ఒక కప్పు తరిగిన పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలి.
తర్వాత రెండు టమాటో, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి.. ఆ మిశ్రమాన్ని కూడా మనం చేస్తున్న కూరలో వేసి ఉడకనివ్వాలి.
అది బాగా దగ్గరయిన తర్వాత..మనం ఉడక పెట్టుకున్న పప్పుని అందులో వేయాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు ఉరకనివ్వాలి.
చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే.. ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ.