ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి ఓట్స్ బుర్జ్.. సింపుల్గా తయారీ ఇలా!
ఓ బాణలిలో కూరగాయలు, మసాలా దినుసులను వేయించడానికి మీకు సరిపడినంత నూనెను వేడి చేయండి.
కట్ చేసిన ఉల్లిపాయలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
తర్వాత ముక్కలుగా తరిగిన టమాటోలు మెత్తగా, గుజ్జు వచ్చేవరకు ఉడికించాలి.
కొంచెం ఘాటు.. కారం.. రుచి ఉండేందుకు గరం మసాలా, జీలకర్ర, పసుపు, కారం పొడిని వేయండి
వేయించిన మిక్స్ ఓట్స్ వేసి తర్వాత మసాలా మిశ్రమంతో బాగా కలపాలి
ఓట్స్ వేశాక కూరగాయలు వేసి కలపండి. మీకు ఇష్టమైతే క్యారెట్, బఠానీలు కూడా వేసుకోవచ్చు.
కొద్దిసేపు కలిపాక కొత్తిమీర.. పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.