అల్పాహారంలో ఇవి తింటే.. వందేళ్లయిన ఎముకలు అరగకుండా ఉంటాయి!

Dharmaraju Dhurishetty
Jan 26,2025
';

రోజు అల్పాహారంలో భాగంగా క్యాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉండే ఆహారాలు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎముకల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

';

రాగి పిండితో చేసిన ఆహారాల్లో క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు రాగి పిండితో చేసిన ఆహారాలు తింటే ఎముకలు శక్తివంతంగా తయారవుతాయి.

';

చాలామంది రాగి పిండితో రాగి జావా ఇతర ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా రాగి పిండితో వడలను తయారు చేసుకొని చూశారా.?

';

రాగి పిండితో తయారు చేసిన వడలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే రాగి పిండితో వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

ఇంట్లోనే ఇలా సులభంగా రాగి పిండితో వడలను అతి తక్కువ పదార్థాలతోనే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన), కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం: ముందుగా ఈ వడలను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో తగినంత రాగి పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దికొద్దిగా నీటిని వేసుకుంటూ వడలకు అవసరమైనంత మిశ్రమం లాగా నీటిని వేసుకొని కలుపుకోండి.

';

ఇలా కలుపుకున్న పిండిని దాదాపు ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ఓ పెద్ద మూకుడు పెట్టుకొని అందులో నూనెను వేసుకొని వేడి చేసుకోండి.

';

నూనె బాగా వేడి అయిన తర్వాత రాగి పిండితో చిన్నచిన్న వడలను వేసుకొని నూనెలో వేసుకోండి. వడలు రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story