రోజు ఉదయాన్నే రాగి పిండితో చేసిన దోస తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో రోజు ఇబ్బంది పడేవారు బ్రేక్ ఫాస్ట్‌లో తప్పకుండా రాగి దోసను చేర్చుకోండి.
';
ప్రతిరోజు అల్పాహారంలో రాగి దోసను చేర్చుకుంటే పొట్ట ఆరోగ్యంగా ఉండటమే.. కాకుండా బరువు కూడా తగ్గుతారు.
';
మీరు కూడా ఈ రాగి దోసను ఇంట్లోనే ఎంతో సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
కావలసిన పదార్థాలు: రాగుల పిండి - 1 కప్పు, బియ్యం పిండి - 1/4 కప్పు, మినప పప్పు - 1 టేబుల్ స్పూన్, శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగిన)
';
కావలసిన పదార్థాలు: అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరిగిన), కరివేపాకు - కొద్దిగా, నూనె - దోస వేయించడానికి, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - పిండి కలపడానికి
';
తయారీ విధానం: రాగి దోసను తయారు చేసుకోవడానికి ముందుగా రాగులు, బియ్యం, మిరప గుండ్లను దాదాపు పది గంటల పాటు నానబెట్టి ఉంచాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఇలా నానబెట్టిన అన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని, అందులోనే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
';
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని.. స్టవ్ పై పెనం వేడి చేసుకోండి.
';
వేడి చేసుకున్న పెనంపై చిన్న చిన్న దోసలు వేసుకొని.. వేడివేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇలా వేసుకున్న దోశలు రోజు తింటే అధిక బరువు కూడా తగ్గుతారు.