వేసవికాలం సాయంత్రం పూట తినడానికి ఎంతో సులువుగా చేసుకునే బ్రెడ్బాల్ తయారీ విధానం మీకోసం..
నాలుగు బ్రెడ్స్ ని బాగా ముక్కలుగా చేసుకొని.. అందులోనే ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసి గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చక్కర, కొద్దిగా యాలకుల పొడి, బాదం ముక్కలు, జీడిపప్పు వేసి చేతులతో మెత్తగా చేసుకోండి.
ఆ మిశ్రమంలోని 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన.. పాలను పోసి చేతితో బాగా మెత్తగా కలుపుకోండి.
ఆ పేస్టుని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి.
చివరిగా ఫ్రైయింగ్ పాన్ పెట్టి, వేయించడానికి కావల్సినంత నూనె వేసుకోండి.
నూనెవేడయ్యాక అందులో ఈ బాల్స్ ని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే.. ఎంతో రుచికరమైన కరకరలాడే బ్రెడ్ బాల్స్ రెడీ.