వ్యాయామాలు చేయకుండానే.. ఉదయాన్నే ఇది తింటూ బరువు తగ్గండి..
Dharmaraju Dhurishetty
Jan 29,2025
';
అధిక బరువు పెరగడం అనేది ఇప్పుడు చిన్న సమస్యగా మారింది. చాలామంది యువత ఎక్కువ బరువు పెరుగుతున్నారు.
';
నిజానికి అధిక బరువు కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది అనారోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు.
';
బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా కొంతమంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు.
';
సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి అనేక రెమిడీలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల సలాడ్స్‌ను చేర్చుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు.
';
ప్రతిరోజు చిలకడదుంపతో తయారుచేసిన సలాడ్‌ను చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకోండి.
';
కావలసిన పదార్థాలు: 2 మీడియం చిలకడదుంపలు(ఉడికించి), 1/2 ఎర్ర ఉల్లిపాయ, సన్నగా తరిగిన, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర, 1/4 కప్పు నిమ్మరసం, 1/4 కప్పు ఆలివ్ నూనె, ఉప్పు మరియు మిరియాలు రుచికి
';
తయారీ విధానం: ముందుగా చిలకడదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
';
ఓ పెద్ద బౌల్ తీసుకోండి అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా మిక్స్ చేసుకున్న బౌల్ లోనే కట్ చేసుకున్న అన్ని రకాల వెజిటేబుల్స్, ఇతర పదార్థాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
';
అన్ని మిక్స్ చేసిన తర్వాత 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లు పెట్టుకొని.. సర్వ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న సలాడ్ రోజు ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు..