తెలంగాణలో చప్పటి ఆవకాయ, కారం ఆవకాయలను ఎక్కువగా తింటారు.
మామిడి కాయలను మార్కెట్ నుంచి తెచ్చుకుని కడిగి, తొక్కతీసి, చిన్న ముక్కలుగా చేసుకొవాలి
నువ్వులపొడి, వెల్లూల్లీ పెస్ట్, ఆవపోడి, మెంతుల పొడి, జీలకర్రను వేయించుకొవాలి
ఆ తర్వాత గ్యాస్ మీద కడాయ్ లో నూనె వేడిచేయడానికి పెట్టాలి
నూనె వేడి అయ్యాక.. ఆవాలు,జీలకర్ర,కరివేపాకులు వేసి ఒక ఐదునిముషాలు ఉంచాలి
అప్పుడు తురిమిన మామిడి కాయ ముక్కలకు, నువ్వులపొడి, ఆవపొడి, మెంతులు కలపాలి.
వీటితో పాటు, వెల్లూల్లీ పెస్ట్, జీరపౌడర్ లను,కాస్తంతా పసుపు కూడా మామిడి ముక్కలకు కలపాలి.
ఇలా మామిడి ముక్కలను కలిపినాక రెండు గంటల పాటు అలానే ఉంచేయాలి.
ఆతర్వాత ఇప్పటివరకు పెట్టుకున్న వేడీ నూనె పోపును, ఈ మామిడి ముక్కలున్న పాత్రలో వేయాలి.
మామిడి ముక్కలు అన్నివైపులా కలసి పోయేలా చక్కగా మిక్స్ చేస్తే చప్పటి ఆవకాయ రెడీ..