పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ ఆకులను ఉపయోగిస్తుంటారు. వీటికోసం మల్బరీ చెట్లను పెంచుతారు. మల్బరీ ఎరుపు, తెలుగు రంగులో ఉంటుంది.
మల్బరీ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. పుల్లగా, తీయ్యగా జ్యూసీగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఈ పండ్లను ఎక్కువగా షర్బత్, స్వ్కాష్, జెల్లీలు, సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు. ఈ పండ్లలో ఔషద గుణాలు అనేకం ఉన్నాయి.
చైనీస్ మూలికా వైద్యంలో గుండె జబ్బులు, షుగర్, రక్తహీనత, ఆర్థరైటిస్ చికిత్సలకు మల్బరీలను కొన్నేండ్లుగా ఉపయోగిస్తున్నారు.
డయాబెటిస్ రోగులకు మల్బరీ ఎంతో మేలు చేస్తుందట. డయాబెటిస్ మాత్రమే కాదు అనేక వ్యాధులు నయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. మల్బరిని పోషకాల గని అంటారు.
మల్బరిలో పోషకాలు తోపాటు విటమిన్స్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాలిక్ ఆమ్లాలు, మెగ్నీషియం తోపాటు విటమిన్స్ ఇ, కె, ఏలు ఉన్నాయి.
మల్బరీ తింటే శరీరంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుందట. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే పోషకాలు ఎన్నో ఉన్నాయి.
మల్బరీ పండ్లు తింటే కళ్లకు మంచిది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ముఖంపై ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ పండ్లు డైట్లో చేర్చుకుంటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.