టమాటో కారం పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

టమాటోలు - 4 (పెద్దవి, ముక్కలుగా కోయాలి), ఎండు మిరపకాయలు - 4-5, వెల్లుల్లి రెబ్బలు - 4-5, కరివేపాకు - 1 రెమ్మ

Dharmaraju Dhurishetty
Mar 31,2024
';

కావాల్సిన పదార్థాలు-1:

ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం పార్ట్-1:

ముందుగా ఒక కళాయి సౌవ్‌ మీద పెట్టి నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

';

పార్ట్-2:

అందులోనే కరివేపాకు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

పార్ట్-3:

టమాటో ముక్కలు మెత్తబడి, రసం వచ్చే వరకు ఉడికించాలి. చిన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయాలి.

';

పార్ట్-4:

పచ్చడి చల్లారిన తర్వాత, ఒక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో పచ్చడిని తీసుకుని, ఒక చిన్న టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పోసుకుని తినొచ్చు.

';

చిట్కా:

టమాటో కారం పచ్చడి మరింత కారంగా కావాలంటే, ఎండు మిరపకాయలను ఎక్కువగా వేసుకోవచ్చు.

';

చిట్కా-1:

పచ్చడిని ఎక్కువసేపు ఉడికించకూడదు, లేకపోతే రంగు మారిపోతుంది. పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే, ఒక వారం పాటు నిల్వ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story