చాలా మంది ఎన్నో రకాల పక్షులను చూసి ఉంటారు. కానీ ఈ పక్షి ఎంతో ప్రత్యేకమైనది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి భూమిపై అసలు కాలు పెట్టదట.
అచ్చం చూడడానికి పావురంలా కనిపించే ఈ గ్రీన్ బర్డ్ పాదాలను భూమిపై పెట్టేందుకు ఇష్టపడదు.
ఈ గ్రీన్ బర్డ్‌ను మహారాష్ట్ర రాష్ట్ర పక్షిగా పిలుస్తారు. కానీ ఇవి ఎక్కువగా యూపీలో కనిపిస్తాయి.
ఈ పక్షి దట్టమైన అడవుల్లో ఎక్కువగా నివసించేందుకు ఇష్టపడుతుంది.
అలాగే ఈ పక్షి మర్రి చెట్లు, ఇతర పెద్ద వృక్షలపై గూళ్లను పెడుతుంది.
ఈ పక్షి దాదాపు 26 సంవత్సరాల పాటు జీవిస్తుందట. అలాగే 36 సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇది చాలా అరుదుగా నెలపైకి వస్తుంది. మిగిత సమయాల్లో ఎక్కువగా చెట్లపై గడుపుతుంది.