వారంలో 2 కేజీల బరువును తగ్గించే అద్భుతమైన షేక్..

Dharmaraju Dhurishetty
Jun 05,2024
';

చాలామంది బరువు తగ్గాలనుకునే వారు గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు.. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారా?

';

నిజానికి బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు సమతుల్యమైన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామాలు చేసే క్రమంలో ఏది పడితే అది తినడం మానుకోవాల్సి ఉంటుంది. ఆహారాలను డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాలి.

';

బరువు తగ్గే సందర్భంలో తప్పకుండా ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పూట అల్పాహారానికి బదులుగా కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ప్రతిరోజు బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తీసుకోవలసిన డ్రింక్స్ లో మిల్క్ షేక్ ఒకటి.

';

ఓట్స్ తో తయారుచేసిన మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అయితే బరువు తగ్గే క్రమంలో మీరు కూడా ఈ మిల్క్ షేక్ ను తప్పకుండా ట్రై చేయండి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

ఓట్స్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: ఒక చిన్న కప్పు ఓట్స్, ఒక కప్పు చల్లని పాలు, ఒక రెండు టీ స్పూన్ల తేనె, నానబెట్టిన బాదం, నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష

';

తయారీ విధానం: ముందుగా ఈ షేక్ తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకున్న అన్ని పదార్థాలను మిక్సీ గ్రైండర్ బ్లెండర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.

';

మిశ్రమం బాగా తయారైన తర్వాత కొద్దికొద్దిగా పాలను పోస్తూ మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story