ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సోమవారం పట్నాకు వెళ్లారు.
అక్కడ తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ ను దర్శించుకున్నారు.
సిక్కులు పవిత్రంగా భావించే ధరించే టర్బన్ ను మోదీ ధరించారు.
మోదీ నారింజ రంగు టర్బన్ ధరించి, గురుద్వారా దర్శించుకున్నారు.
అనంతరం భక్తులకు వండే అన్నప్రసాదం దగ్గరకు వెళ్లారు.
అక్కడ పెద్ద పెద్ద పాత్రలలో భోజనం వండటం ను చూసి గరిట పట్టుకున్నారు
భక్తులు భోజనాలు సమయంలో లంగర్ గా పిలిచే ప్రసాదం వడ్డన చేశారు.
తన స్వహస్తాలతో మోదీ అక్కడున్న అందరికి వడ్డన చేశారు.
గురు గోవింద్ సింగ్, పదవ సిక్కు గురువు. 1666లో పాట్నాలో జన్మించారు.