జ్యోతిష్య శాస్త్రంలో శని అమావాస్య రోజున సంభవించబోతున్న సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సూర్యగ్రహణం కొన్ని సంవత్సరాల తర్వాత శని అమావాస్య రోజు వచ్చిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.
శని అమావాస్య రోజున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి వీరిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది.
సూర్యగ్రహణం రోజున అందరూ తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
సూర్య గ్రహణానికి ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు తలస్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఇది పురాతన కాలం నుంచి వస్తోంది.
సూర్యగ్రహణం సంభవించే మూడు గంటల ముందే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
సూర్యగ్రహణం సమయంలో ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా సూర్యగ్రహణ సమయంలో విష్ణు స్తోత్రాలను, శివుడి పాటలను వినడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి సంభవించకుండా తులసి ఆకులను ఇంట్లోని ఓ చిన్న పాత్రలో నీటిలో వేయాల్సి ఉంటుంది.
సూర్య గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దేవతామూర్తులకు గంగాజలంతో అభిషేకం చేయాలి.