హనుమంతుడు అంజన, కేసరీ లకు శంకరుడి వర ప్రభావం వల్ల జన్మించాడు.
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని చూసి పండు అనుకొని తినాలనుకుంటాడు
ఇంద్రుడు బాల హనుమంతుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు.
అది కాస్త హనుమకు బలంగా తాకడంతో ఆయన ఒక్కసారిగా భూమి మీదకు పడిపోతాడు
వాయుదేవుడు హనుమను కాపాడి, ఇంద్రుడి మీద కోపంతో గాలి వీచడం ఆపేస్తాడు.
దీంతో దేవుళ్లు, రుషులు వాయుదేవుడిని శాంతింప చేసి హనుమకు గాయం మానేలా చేస్తారు
బాల హనుమంతుడికి రుషులు, దేవుళ్లు అనేక వరాలు, ఆశీస్సులు అందజేస్తారు.
అరణ్యంలో రాముడి దగ్గరకు మారు వేశంలో వెళ్లిన కూడా రాముడు హనుమను గుర్తుపడతాడు
సీతాదేవీ కోసం లంకకు వెళ్లి, చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చితన రామభక్తిని చాటుకుంటాడు
హనుమను భక్తితో కొలిచిన వాళ్లకు భయం, శత్రుబాధలు, శని ప్రభావం ఉండదని చెబుతుంటారు.