ఢిల్లీ టీమ్ కెప్టెన్సీ ఆఫర్‌పై కోహ్లీ రియాక్షన్ ఇదే..!

Ashok Krindinti
Jan 28,2025
';

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తరువాత రంజీల్లో అడుగుపెట్టనున్నాడు.

';

2012లో చివరగా దేశవాళీలో ఆడాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ తరుఫున ఆడనున్నాడు.

';

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లలో కోహ్లీ పాల్గొన్నాడు.

';

మంగళవారం ఉదయం కోహ్లీ కోట్లా మైదానంలో ప్రాక్టస్ కోసం ఎంట్రీ ఇచ్చాడు. టీమ్ సభ్యులతో కలిసి ముమ్మరంగా సాధన చేశాడు.

';

ఢిల్లీ ఆటగాళ్లకు కోహ్లీతో ఎక్కువసేపు గడిపే అవకాశం లభిస్తే.. గొప్ప అనుభవం లభిస్తుందని ఢిల్లీ టీమ్ కోచ్ అన్నాడు.

';

రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌ కోసం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని కోహ్లీకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

';

అయితే తాను కెప్టెన్సీ చేపట్టనని కోహ్లీ సున్నితంగా తిరస్కరించాడట.

';

ఆయూష్ బడోని కెప్టెన్సీలో ఆడేందుకు తనకు అభ్యంతరం లేదని.. కెప్టెన్సీ మారిస్తే యువతకు తప్పుడు సందేశం వెళుతుందని చెప్పినట్లు సమాచారం.

';

2012లో ఘజియాబాద్‌లోని మోహన్ నగర్‌లో యూపీతో జరిగిన మ్యాచ్‌లో చివరగా ఢిల్లీ టీమ్‌కు కోహ్లీ ప్రాతినిధ్యం వహించాడు.

';

VIEW ALL

Read Next Story