Dandruff Remedy: చలికాలంలో డేండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం కల్గించే అద్భుతమైన పదార్ధం
చలికాలంలో ఆయిలీ స్కాల్ప్ ఉండేవారికి డేండ్రఫ్ సమస్య అధికంగా ఉంటుంది. దాంతో జుట్టు కూడా రాలుతుంటుంది. నిర్జీవంగా మారుతుంది
తలలో డేండ్రఫ్ ఉంటే నలుగురిలో చాలా అసౌకర్యంగా, సిగ్గుగా ఉంటుంది. అందుకే ఈ సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.
డేండ్రఫ్ నుంచి విముక్తి పొందేందుకు పూజల్లో ఉపయోగించే కర్పూరం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కర్పూరంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల డేండ్రఫ్ నుంచి చాలా సులభంగా విముక్తి పొందవచ్చు
కర్పూరంను కొబ్బరి నూనెలో కలిపి స్కాల్ప్‌కు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల డేండ్రఫ్ సులభంగా తొలగించవచ్చు
డేండ్రఫ్ సమస్య మరింత తీవ్రంగా ఉంటే కర్పూరం, లవంగం పౌడర్ చేసి వేప మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించాలి.
కర్పూరం సాధారణంగా పూజల్లో ఉపయోగిస్తుంటారు. కానీ తలకు డేండ్రఫ్ సమస్య నుంచి గట్టెక్కించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే కొందరికీ ఎలర్జీ ఉంటుంది. అది చూసుకుని వాడాలి