తలనొప్పిని సహజంగా తగ్గించాలంటే అల్లం టీ మంచి పరిష్కారం.
అల్లం యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. కలిగి ఉండటంతో తలనొప్పిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగించిన నీటిని ఫిల్టర్ చేసి, దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసుకోండి.
వేడి వేడి అల్లం టీ తాగడం ద్వారా తలనొప్పి క్షణాల్లో తగ్గుతుంది.
తలనొప్పి వచ్చినప్పుడు లేదా పనిలో ఒత్తిడి అనిపించినప్పుడు వెంటనే ఈ టీ తాగండి.
ఈ పానీయం తేనె, అల్లం, నిమ్మరసం సహజమైనవి కావడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం కాదు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.