మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది దగ్గు, కఫంతో బాధపడుతుంటారు. ఛాతీలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దాం.
వీటిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల ఏలకులు కాలానుగుణ సమస్యల నుంచి బయపటపడేలా చేస్తాయి.
నల్లఏలకుల్లో ఉండే లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో శ్వాసనాళంలో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మీరు దగ్గు సమస్యతో బాధపడుతుంటే నల్ల ఏలకులతో తయారు చేసిన టీ తాగవచ్చు. రెండు పెద్ద ఏలకులను తీసుకుని మెత్తగా నీటిలో వేసి మరిగించి తాగాలి.
ఏలకులు, టీ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఫిల్టర్ చేసి అందులో తేనే కలుపుకుని తాగవచ్చు. ఇలా రోజూ తాగితే కఫం కరుగుతుంది.
శ్లేష్మం, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే తేనెలో నల్ల ఏలకులను కలుపుకుని తినవచ్చు.
పెద్ద ఏలకులను తీసుకుని గ్రైండ్ చేసి దాని పొడిలో తేనె కలుపుకుని తినాలి.
ప్రతిరోజూ రాత్రి తేనె, ఏలకుల మిశ్రమాన్ని తింటే దగ్గు, ముక్కు దిబ్బడ, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.