షుగర్ పేషెంట్స్ కి చపాతి ఎంతో మంచిది అంటారు.. అయితే రొటీన్ చపాతి తిని మీకు బోర్ కొట్టి ఉంటే.. చపాతి ట్రై చేయండి
ముందుగా ఒకటిన్నర కప్పు గోధుమపిండి తీసుకొని అందులోనే సన్నగా తరిగిన ముప్పావు కప్పు మునగాకు.. రెండు ఉల్లిపాయలు.. ఒక కప్పు కొత్తిమీర తరుగు.. వేసుకొని కలుపుకోండి.
అందులోనే కొంచెం పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పావు స్పూను కారం, జీలకర్ర పొడి, పసుపు, యాలకుల పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపండి.
ఇప్పుడు ఈ పిండిని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి లాగా కలుపుకోండి.
ఆ తరువాత పిండిని గాలి తగలకుండా మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి.
ఇప్పుడు చిన్న భాగాన్ని తీసుకొని చపాతీలా చేసుకోండి. మరో పక్క స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి
నూనె వేడెక్కాక ముందుగా రుద్దుకున్న చపాతీని..దానిపై వేసి రెండు వైపులా కాల్చుకోండి. అంతే ఎంతో రుచికరమైన మునగాకు చపాతి రెడీ..