పడకడుపున అరటిపండు తినడం జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది.
అరటిపండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. ఉదయాన్నే ఇది తినడం వల్ల రోజు మొత్తానికి సరిపడా శక్తి మనకి కలుగుతుంది.
రోజూ అరటిపండు తినడం వల్ల గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇది బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు చర్మం కాంతివంతంగా మారడానికి తోడ్పడుతుంది.
అరటిపండు తినడం శరీరానికి కావలసిన ఎన్నో విటమిన్స్ ని తెచ్చిపెడుతుంది.
అరటిపండుతో పాటు.. పాలు తాగడం శరీరానికి మరింత మేలు చేస్తుంది.
ప్రతి రోజు పడకడుపున అరటిపండు తినడం ఆరోగ్యకరమైన జీవితానికి దారితీస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.