ఉదయాన్నే ఈ లడ్డు తింటే.. రక్తహీనత సమస్యకు శాశ్వతంగా బైబై..
Dharmaraju Dhurishetty
Jan 26,2025
';
శనగపిండి, నెయ్యితో చేసిన లడ్డూలు రోజు తింటే శరీరానికి మెగ్నీషియంతో పాటు పొటాషియం, ఐరన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది.
';
తరచుగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు అల్పాహారం తర్వాత ఈ లడ్డు తింటే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
శనగపిండి లడ్డు తింటే గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
';
పొటాషియం కూడిన ఈ శనగపిండి లడ్డు తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఈ లడ్డును ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.
';
కావలసిన పదార్థాలు: శనగపిండి - 1 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, తాటి బెల్లం - 1/2 కప్పు (పొడి చేసిన), యాలకుల పొడి - 1/2 టీస్పూన్, జీడిపప్పు, కిస్మిస్ - కొద్దిగా
';
తయారీ విధానం: ఈ లడ్డులను తయారు చేసుకోవడానికి ముందుగా ఓ పెద్ద పాన్ తీసుకోండి.. అందులో శనగ పప్పు వేసుకొని బాగా వేపుకోండి.
';
ఇలా వేపుకున్న పప్పును చల్లబడిన వెంటనే పిండిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకుని వేడి చేసుకోండి.
';
ఇలా వేడి చేసుకున్న నెయ్యిలో శనగపిండిని వేసుకొని బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత మరో బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని తాటి బెల్లం వేసి పాకంలా తయారు చేసుకోండి.
';
మిశ్రమంలా తయారైన తర్వాత లడ్డూలను చిన్నచిన్నగా కట్టుకుంటూ వేరే బౌల్లో పెట్టుకొని గాజు సీసాలో భద్రపరచుకోండి. అంతే శనగపప్పు లడ్డూలు తయారైనట్లే.. ఈ లడ్డు రోజు తింటే రక్తహీనత సమస్య రాదు..
';
పాకం బాగా ముదిరిన తర్వాత అందులో కాస్తంత నెయ్యి, శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. ముద్దలు కట్టకుండా బాగా కలుపుకుంటూ అందులో కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి.