ఆధునిక జీవనశైలి కారణంగా అతి చిన్న వయసులోనే కొంతమందిలో గుండెపోటుతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి.
';
కొంతమంది యువతలో అధిక రక్తపోటు పెరిగి తీవ్ర గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది.
';
గుండె సమస్యలు రాకుండా ఉండడానికి చాలామంది పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తింటున్నారు.
';
కొంతమంది అయితే గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్ రాకుండా చిరుధాన్యాలతో కూడిన ఆహారాలని ఎక్కువగా తింటున్నారు. అందులో జొన్న, రాగి చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు ఎక్కువగా తింటున్నారు.
';
ప్రతిరోజు జొన్నతో తయారు చేసిన లడ్డు తింటే గుండెను ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
మీరు కూడా మీ పిల్లలకు, మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు జొన్న లడ్డున రోజు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
జొన్న రవ్వ లడ్డు తయారీ విధానం, కావలసిన పదార్థాలు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
';
కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ - 1 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, పంచదార లేద తాటి బెల్లం - 3/4 కప్పు (లేదా రుచికి తగినంత), యాలకుల పొడి - 1/2 టీ స్పూన్, జీడిపప్పు, కిస్మిస్ - కొద్దిగా
';
తయారీ విధానం: ముందుగా ఓ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జొన్న రవ్వను వేసి బాగా అటు ఇటు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేపుకోండి.
';
వేపుకున్న తర్వాత జొన్న రవ్వ రంగు మారడం గమనించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓ పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని పంచదారని వేసి బాగా కలుపుకోండి. పంచదార పాకంలా గట్టిపడ్డాక.. అందులో యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోండి.
';
యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జొన్న రవ్వను అందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్‌ను కట్ చేసుకొని అదే మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. అంతే జొన్న లడ్డు తయారైన.. అయితే ఇక్కడ చక్కెరకు బదులుగా తాటి బెల్లాన్ని కూడా వినియోగించవచ్చు.