ఉదయాన్నే కాఫీ తాగడం మంచిదా..? లేదా టీ తాగడం మంచిదా?
Dharmaraju Dhurishetty
Jan 17,2025
';
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు టీ కాఫీలు తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా చాలామంది ఉదయం లేవగానే కాఫీ ని ఎక్కువగా తాగుతున్నారు.
';
చాలామందిలో ప్రతిరోజు టీ తాగడం మంచిదా కాఫీ తాగడం మంచిదాని సందేహం కలుగుతోంది. నిజానికి ఈ రెండింటిలలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
';
ప్రతిరోజు ఒక కాఫీ తాగితే అందులో 95 మిల్లీ గ్రాముల కెఫిన్ లభిస్తుంది. అదే ఒక కప్పు టీ తాగితే 30 నుంచి 40 మిల్లీగ్రాముల కెఫిన్ పొందుతారు.
';
రుచిని బట్టి చూస్తే.. కాఫీ కాస్త చేదుగా ఉంటుంది. ఇక టీ సంగతి పెద్దగా చెప్పనక్కర్లేదు..
';
కాఫీని చెట్టు నుంచి వచ్చిన గింజల నుంచి తయారుచేస్తారు. దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి హెల్త్ పరంగా కాస్త అటు ఇటు ఉంటుంది.
';
ఇక టీని మాత్రం ఆకులతో తయారుచేస్తారు. కాబట్టి ఎలాంటి బాలు లేకుండా ఈ టీ పౌడర్ తో డికాషన్ తాగితే అద్భుత ఫలితాలు పొందుతారు.
';
ఈ రెండింటికి సంబంధించిన ప్రయోజనాల వివరాల్లోకి వెళితే.. కాఫీ టీలలో రెండింట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజు తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
';
ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల మానసిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది.
';
కొంతమందిలో కాఫీ టీ రెండూ తాగడం వల్ల ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ప్రమాదకరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
';
అయితే ప్రతిరోజు ఈ రెండింటిని అతిగా తాగే వారు.. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా తాగడం వల్ల అనేక సమస్యలకు దారి తీయవచ్చు..