క్యారెట్ సమోసాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఎవర్ గ్రీన్ రెసిపీ మీ కోసమే..

Dharmaraju Dhurishetty
Jan 17,2025
';

క్యారెట్ సమోసాలను చాలామంది ఇంట్లో తయారు చేసుకుంటున్నారు. ఈ తయారీ సమయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనివల్ల సరైన రుచి పొందలేకపోతున్నారు.

';

నిజానికి క్యారెట్ సమోసాను ఎంతో సులభమైన పద్ధతిలో తక్కువ ఇంగ్రిడియంట్స్ తో తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

';

క్యారెట్ సమోసా కు కావలసిన పదార్థాలు: మైదా పిండి - 1 కప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - తగినంత

';

కూర కోసం కావలసిన పదార్థాలు: క్యారెట్లు - 2 (తురిమినవి), ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరిగినది), నూనె - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టీ స్పూన్, ఆవాలు - 1/2 టీ స్పూన్

';

కావలసిన పదార్థాలు: పసుపు - 1/4 టీ స్పూన్, కారం - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1/2 టీ స్పూన్, గరం మసాలా - 1/4 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగిన)

';

తయారీ విధానం: ముందుగా ఈ క్యారెట్ సమోసాలు తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మైదాపిండి, వేడి చేసిన నూనెను వేసుకొని నీరు పోస్తూ మెత్తగా కలుపుకోండి.

';

ఇలా కలుపుకున్న పిండిని దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కు సంబంధించిన కూర ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి.

';

కూర తయారీ కోసం ముందుగా ఒక పెద్ద ఫ్యాన్ తీసుకోండి.. దానిని స్టవ్ పై పెట్టుకొని అందులో తగినంత నూనె, కాస్తంత నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకోండి.

';

ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత అల్లం ముక్కలు క్యారెట్, తురుము పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.

';

ఆ తర్వాత తగినంత కొత్తిమీర, ఇతర పదార్థాలు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకొని దాదాపు రెండు నిమిషాలు బాగా ఉడికించుకొని పక్కకు తీసుకోండి.

';

ముందుగా తయారు చేసుకున్న సమోసాల పిండిని రోటీల్లా తయారు చేసుకొని.. దానిని మధ్యలో కట్ చేసుకుని స్టఫింగ్ చేసుకొని సమోసాలా తయారు చేసుకోండి.

';

ఆ తర్వాత పెద్ద కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని ఈ సమోసాలను అందులో వేసి కలర్ మారాంతవరకు వేపుకోండి.

';

VIEW ALL

Read Next Story