ఈ లడ్డు రోజు తింటే.. 70 ఏళ్ల వరకు మలబద్ధకం సమస్య రాదు..
Dharmaraju Dhurishetty
Jan 26,2025
';
కొంతమందిలో ఫైబర్ లోపం కారణంగా అనేక పొట్ట సమస్యలు వస్తున్నాయి. దీంతోపాటు ఇతర అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
';
రోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా ఫైబర్ అధిక మోతాదులో ఉండేటట్లు చూసుకోవడం ఎంతో మంచిది. లేకపోతే తీవ్ర పొట్ట సమస్యలకు దారితీస్తుంది.
';
చిన్న వయసులోనే ప్రస్తుతం చాలామందిలో గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి.
';
కొంతమందిలో మలబద్ధకం విపరీతంగా పెరిగి.. ఇతర పొట్ట సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి, ఇప్పటికే ఈ సమస్యలున్న వారికి అద్భుతమైన లడ్డును పరిచయం చేయబోతున్నాం.
';
ప్రతిరోజు వేరుశనగతో తయారుచేసిన లడ్డును తింటే అనేకరకాల అనారోగ్య సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా మలబద్దకం రాకుండా ఉంటుంది.
';
వేరుశనగ లడ్డులో విటమిన్ E, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, పొటాషియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. రోజు తింటే శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది.
';
కొంతమంది ఈ వేరుశనగల లడ్డూను తయారు చేసుకునే క్రమంలో పొరపాట్లు పడుతున్నారు. అయితే ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
';
కావలసిన పదార్థాలు: వేరుశెనగలు - 1 కప్పు, బెల్లం - 1 కప్పు (తురిమిన), నీరు - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్ (కావలసినంత)
';
తయారీ విధానం: ముందుగా ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి వేరుశనగలను తీసి ఒక ఒక పాన్‌లో వేసి తక్కువ మంట మీద దొరగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇవి వేగిన తర్వాత చల్లార్చుకుని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత మరో పాన్ పెట్టుకుని అందులో బెల్లం తగినంత నీరు యాలకుల పొడి వేసి పాకం తీగలగా వచ్చేంతవరకు బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత అందులోనే వేరుశెనగ వేసి నీకు చేసుకోండి.
';
వేరుశనగ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, మిశ్రమం గట్టిపడకముందే లడ్డూలను కట్టుకోండి. కట్టుకున్న లడ్డూలను గాజు సీసాలో భద్రపరచుకుంటే.. నెలరోజులపాటు నిల్వ ఉంటాయి.