ఆరేంజ్ జ్యూస్ తాగితే అందం రెట్టింపు అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ముఖంపై ముడతలు రావు.
దానిమ్మ జ్యూస్ తాగితే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. దానిమ్మలోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
పైనాపిల్ జ్యూస్ తాగితే మెరిసే చర్మం మీ సొంతం. ఈ జ్యూస్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. బ్రోమలైన్ చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
కలబంద జ్యూస్ తాగితే చర్మం స్మూత్ గా మారుతుంది. కలబంద జ్యూసులోని పోషకాలు చర్మ సమస్యలను దూరం చేసి..మెరిచేలా చేస్తాయి.
బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వీటిలో మాంగనీస్, విటమిన్ సి, ఫొలిక్ యాసిడ్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.