చుండ్రు సమస్యను తగ్గించేందుకు నేచురల్ ఆయిల్ ట్రీట్మెంట్ ఉత్తమం.
గోరువెచ్చటి కొబ్బరి నూనెలో ఒక రెండు చుక్కలు నిమ్మకాయ రసం కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాలపాటు ఉంచి తర్వాత తలస్నానం చేయండి.
వేపాకులను వేసిన.. గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది.
పైన చెప్పిన విధంగా చేసిన రెండు రోజుల తర్వాత మరోసారి..పెరుగులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేయండి.
ఈ మూడు స్టెప్పులను పాటిస్తే చుండ్రు పూర్తిగా తగ్గుతుందే కాకుండా జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
తక్కువ రసాయనాలు ఉన్న షాంపూలను ఉపయోగించి, ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఇంటిలో అందుబాటులో ఉన్న పదార్థాలతో మాత్రమే ఈ చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.