జీడిపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం విటమిన్ బి6 మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఇందులో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఐరన్, మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచే ఇతర పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి.
జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కండరాలను మెరుగుపరచడంలో సహాయపడే ప్రొటీన్లు ఉంటాయి.
జీడిపప్పులో పిండిపదార్థాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు, పీచుపదార్థాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి.
జీడిపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
జీడిపప్పును క్రమం తప్పకుండా తింటే కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది.