Sprouted wheat: మొలకెత్తిన గోధుమలు తింటే మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం

Bhoomi
Oct 12,2024
';

మొలకెత్తిన గోధుమలు

గోధుమలతో చపాతీలు చేసుకుని తింటాము. గోధుమ పిండిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీరెప్పుడైనా మొలకెత్తిన గోధుమలను తిన్నారా. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

';

ఎముకలు బలంగా

మొలకెత్తిన గోధుమలను తింటే ఎముకలు బలంగా మారుతాయి. ఎందుకంటే వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

';

జీర్ణక్రియ మెరుగ్గా

మొలకెత్తిన గోధుమలను తింటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.

';

బరువు అదుపులో

మొలకెత్తిన గోధుమలను డైట్లో చేర్చుకుంటే కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. అంతేకాదు వీటిని తరచుగా తింటే బరువు అదుపులో ఉంటుంది.

';

పుష్కలంగా పోషకాలు

మొలకెత్తిన గోధుమల్లో పోషకాలు అధికమోతాదులో ఉంటాయి. దీంతో శరీర పనితీరు మెరుగ్గా ఉండటంతోపాటు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

వీటిని ఎలా తినాలంటే

ముందుగా గోధుమలను బాగా శుభ్రం చేయాలి. రాత్రి వీటిని నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని మార్చి మరోసారి కడిగి ఓ గుడ్డలో క ానీ డబ్బాలో కానీ గాలిచొరబడకుండా చూసుకుని 12గంటలపాటు అలాగే వదిలేయాలి.

';

సలాడ్ రూపంలో

ఈ మొలకెత్తిన గోధుమ గింజలను ఉదయం పూట బ్రేక్ ఫాస్టులో తీసుకోవచ్చు. వీటిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

';

వేయించి

పచ్చిగా తినడం ఇష్టం లేనివారు వేయించి..చిటికెడు ఉప్పు చల్లుకుని కూడా తినవచ్చు.

';

Disclaimer

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా అనారోగ్య రుగ్మతలు ఉంటే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story