మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ తో పాయసం.. తయారీ విధానం చూద్దాం..
ముందుగా ఆరు క్యారెట్లను తొక్కను తీసేసి సన్నగా తురుముకోవాలి.
ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసి అందులో క్యారెట్ తురుమును వేసి వేయించుకోవాలి. తరువాత కాస్త నీరు కలిపితే క్యారెట్లు మెత్తగా ఉడుకుతాయి.
అది పేస్టులా అయ్యాక నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్ పాలతో కలిపి.. అందులో వేసి బాగా కలిపి పేస్టులా చేయండి.
క్యారెట్ తురుముతో ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక చిన్న మంట మీదే ఉడికించాలి.
కార్న్ ఫ్లోర్ వేసాక కొద్దిసేపు పాటు ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి.
ఆ తరువాత రుచికి సరిపడా పంచదార.. పాలు స్పూను యాలకల పొడి వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్ లో ..పెట్టి తాగితే ఎంతో చల్లని క్యారెట్ పాయసం రెడీ