ఈ వేసవి కాలం ఏదైనా వెరైటీ స్నాక్ తినాలి అనుకుంటే..ఈ మామిడికాయ పకోడాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక మామిడికాయను చాలా సన్నగా తురుము కావాలి.
అదే గిన్నెలో ఒక కప్పు శెనగపిండి,పావు స్పూను పసుపు, అర స్పూన్ జీలకర్ర, కారం, తగినంత ఉప్పు, నాలుగు స్పూన్లు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
అవసరమైతే కాస్త నీళ్లు చల్లుకుంటూ పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో అంత మందంగా చేసి పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకొని.. వేడెక్కాక మామిడి తురుము మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోండి.
అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పకోడా రెడీ