పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే స్నాక్..అరటిపండుతో రవ్వ బాల్స్ తయారీ విధానం మీకోసం
ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి.. అందులో కొద్దిగా నెయ్యి వేసి.. జీడిపప్పు, బాదంపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి.. పక్కన పెట్టుకోవాలి.
అ తర్వాత మరోసారి స్టవ్ పైన పాన్ పెట్టి.. టీస్పూన్ నెయ్యి పోసి..వేడి అయ్యాక.. అందులో రవ్వ వేసి వేయించుకొని..పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్లీ అదే పాన్‌లో 1/2 టీస్పూన్ నెయ్యి మళ్లీ పోసి అందులో అర కప్పు కొబ్బరి తురుము వేసి వేయించాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 అరటిపండ్లు వేసి, 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత మనం ముందుగా వేయించిన వేయించిన రవ్వ, కొబ్బరి, జీడిపప్పు, బాదం, యాలకుల పొడి అరటి మిశ్రమంలో వేసి మెత్తగా కలుపుకోవాలి.
ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేటులో పెట్టుకోవాలి.
ఇక చివరగా బాణలి పెట్టి వేయించడానికి కావల్సినంత నూనె వేసి.. బాగా వేడయ్యాక అందులో మనం చేసి పెట్టుకున్న బాల్స్‌ను వేయాలి.
సన్నని మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే.. ఎంతో రుచికరమైన అరటిపండు రవ్వ బాల్స్ రెడీ..