మొటిమలు వస్తే అంత తొందరగా పోవు. పై పెచ్చు పోతూ పోతూ మచ్చల్ని కూడా మిగిలిస్తాయి. మరి అలాంటి మొటిమలను..త్వరగా పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం..
ఐస్ మొటిమలను.. తొందరగా తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
దీని కోసం ఓ బౌల్లో ఐస్ క్యూబ్స్.. వాటితో పాటు కొద్దిగా ఐస్ వాటర్ పోసుకోండి.
ఆ బౌల్ లో 10 సెకన్ల చొప్పున..రెండు, మూడు.. సార్లు మొటిమలు ఉన్న మీ మొహం భాగాన్ని.. పెట్టండి.
ఇలా చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి.. కావాలంటే ఐస్ క్యూబ్స్ ని మొటిమల పైన పెట్టిన మంచిదే.
మరో చిట్కా ఏమిటి అంటే.. కొంచెం. వేప ఆకులని మొత్తగా పేస్ట్ చేసి.. అందులో కొంచెం పసుపు, నిమ్మరసం కలుపుకోండి.
ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట్ల పెట్టాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది కూడా మొటిమలపై మంచిగా ప్రభావం చూపిస్తుంది.