శివుడిని భోళాశంకరుడు, భక్తవ శంకరుడు అనికూడా పిలుస్తారు.
శివయ్యను ప్రసన్నం చేసుకొవడం ఎంతో సులభమని జ్యోతిష్యులు చెబుతారు
అందుకే పురాణాలలో దానవులు ఎక్కువగా శివయ్యగురించే తపస్సు చేసేవారు.
సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజని జ్యోతిష్యులు చెబుతుంటారు.
విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం కాగా,శివుడికి అభిషేకం అంటేఎంతో ఇష్టం.
ఈరోజున ఉదయాన్నేలేచీ, శివుడిని అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యం లభిస్తుంది.
శివుడిని చక్కెర, తేనెతో అభిషేకం చేస్తే మన మనస్సులోని కోరికలు నెరవేరుతాయి.
భస్మంతో శివుడికి అభిషేకం చేస్తే, జాతకంలోని దోషాలు అన్ని సమసిపోతాయి.
పెళ్లికానీ వారు ముఖ్యంగా సోమవారం రోజు శివుడిని, పార్వతిని బిల్వపత్రితో పూజలు చేయాలి