ఈ బాలీవుడ్ స్టార్స్ బాడీగార్డ్స్ జీతం ఓ బడా కార్పోరేట్ కంపెనీ సీఈవో కంటే తక్కువేం కాదు..
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ బాడీ గార్డ్ గా పనిచేస్తోన్న మయూర్ శెట్టిగార్ కు యేడాదికి గాను రూ.1.2 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.
కత్రినా కైఫ్ పర్సనల్ బాడీగార్డ్ అయిన దీపక్ సింగ్ కు యేడాదికి గాను రూ. కోటి వరకు పారితోషికం ఇస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ దగ్గర ప్రకాష్ సింగ్ (సోను) గత కొన్నేళ్లుగా ఆమె బాడీ గార్డ్ గా పనిచేస్తున్నారట. ఈయనకు యేడాదికి గాను రూ. 1.2 కోట్ల జీతం ఇస్తున్నట్టు సమాచారం.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పర్సనల్ బాడీగార్డ్ గా జలాల్ పనిచేస్తున్నారు.ఈయనకు ఆమె యేడాదికి గాను అన్ని సౌకర్యాలతో కలిపి రూ. 2 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ దగ్గర యువరాజ్ ఘోర్పడే కొన్నేళ్లుగా ఆయన అంగరక్షకుడిగా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.
శ్రేయ్‌సే తేలే అక్కీ బాడీ గార్డ్ గా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈయనకు యేడాదికి రూ. 1.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.
సల్లూ భాయ్ దగ్గర ఎన్నో యేళ్లుగా పర్సన్ బాడీ గార్డ్ గా షేరా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.
బిగ్ బీ తన బాడీ గార్డ్ జితేంద్ర షిండే కు యేడాదికి అన్ని సౌకర్యాలతో కలిసి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.
షారుఖ్ ఖాన్ తన బాడీ గార్డ్ అయిన రవి సింగ్ కు యేడాదికి దాదాపు రూ. 2.7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారట.