ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఎంతోమందికి చిన్న వయసు నుంచే వెన్నుపూస నొప్పి వస్తుంది. మరోపక్క సి సెక్షన్ చేసుకున్న మహిళలకు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా బాధపెడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకొక రాగి లడ్డు తింటే ఎంతో మంచిది.
రాగి పిండిలో కల్సియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి ఉపకరిస్తుంది. వెన్నుపూస నొప్పి తగ్గడానికి ఇది అత్యంత ప్రయోజనకరం.
నెయ్యి శరీరంలో నరాల బలం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వెన్నుపూస నొప్పిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బెల్లం శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఇది రక్తంలోని హేమోగ్లోబిన్ స్థాయిని పెంచి వెన్నుపూస నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఈ లడ్డూలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. వెన్నుపూస నొప్పిని నియంత్రించడం వల్ల జీవనశైలిని మెరుగుపరుస్తుంది.
రాగి పిండిని వేయించి, నెయ్యి, బెల్లం కలిపి లడ్డూలుగా తయారు చేయండి. ఇవి సులభంగా తయారు చేయగలిగే ఆరోగ్యకరమైన స్వీట్స్. ఇది రోజు ఒక్క లడ్డు తినడం వల్ల ఇక బ్యాక్ పెయిన్ రమ్మన్నా రాదు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.