రోజూ ఓ నెలపాటు ఉదయం పరగడుపున 100 గ్రాముల పన్నీర్ తింటే ఈ 6 అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

Md. Abdul Rehaman
Jun 06,2024
';


పాల ఉత్పత్తుల్లో ఒకటైనా పన్నీరు రుచికే కాదు ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.

';


ఓ నెలరోజులు 100 గ్రాముల పన్నీరుని రోజూ పరగడుపున తినడం అలవాటు చేసుకుంటే మీ శరీరంలో, ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి

';


పన్నీరు కాల్షియంకు మంచి సోర్స్. ఎముకలు, పళ్లు పటిష్టంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు కూడా తలెత్తవు

';


పన్నీరులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దాంతో కండరాల నిర్మాణం, ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కండరాలు పటిష్టంగా మారుతాయి

';


పన్నీరులో ఉండే ప్రో బయోటిక్స్ కారణంగా జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి.

';


పన్నీరులో విటమిన్ ఎ, విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది. రోజూ పన్నీరు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దూరమౌతాయి.

';


పన్నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. చర్మానికి నిగారింపు వస్తుంది.

';


పన్నీరులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

';

VIEW ALL

Read Next Story