నాగ సాధువుల గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు.. గూస్ బంప్స్ ఖాయం..

TA Kiran Kumar
Jan 20,2025
';

నాగ సాధువులు

నాగ సాధువులు కఠోర తపస్సు తో సన్యాసి జీవితాన్ని గడుపుతుంటారు. అంతేకాదు ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి శివుడి ధ్యానంలోనే గడుపుతారు.

';

ఒంటిపై నూలు పోగు

నాగ సాధువులు ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించరు. గడ్డకట్టే చలిలో సైతం ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తి నగ్నంగా శరీరంపై భస్మలేపనంతో ఉంటారు.

';

నగ్నత్వం

నాగ సాధువుల నగ్నత్వం వారి భౌతిక, నిర్లిప్తతకు చిహ్నం. శివరాధాకులు ముఖ్యంగా లింగంపై పాలు, పెరుగు సహా ఏ వస్తువుతో అభిషేకం చేసినా..జారీ పోతూ ఉంటుంది. అలా సంసార బంధాలను విడిచి పెట్టాలనేదే సందేశం ఇవ్వడం నగ్నత్వం వెనక ఉన్న మర్మం.

';

నాగ సాధువులు

శంకరాచార్యులు దేశంలో బద్రినాథ్, పూరీ, ద్వారక, శృంగేరి దేశంలోని నాలుగు మూలల్లో శంకర మఠాలను ఏర్పరిచారు. వాటి భద్రత కోసమే నాగ సాదువుల బృందాన్ని ఏర్పాటు చేశారనేది చరిత్ర చెబుతున్న సత్యం.

';

ఆధ్యాత్మిక యోధులు

నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పాలి. వీరిని ఆధ్యాత్మిక యోధులుగా పరిగణిస్తారు.

';

శంకరాచార్యులు నియోగించినవారు

సనాతన హిందూ మత పవిత్ర సంప్రదాయాలను రక్షించడానికి అంకితభావంతో పనిచేయడానికే శంకరాచార్యులు నియోగించిన యోధులే నాగ సాదువులు.

';

దీక్షా దక్షత

నాగ సాధువుగా మారడానికి.. కఠినమైన దీక్షా దక్షత ఉండాలి. జనన, మరణాలు అతీతంగా జీవిస్తూ ఉంటారు.

';

శివుడి అనుచరులు

నాగ సాదువులను శివుని అనుచరులుగా భావిస్తారు. అంతేకాదు శివుడి ఆత్మను స్వరూపులుగా భక్తులు విశ్వసిస్తారు.

';

అఖాడాలు

నాగ సాధువులు వేర్వేరు అఖాడాలకు చెందినవారు. బలమైన సమాజ నిర్మాణాన్ని కలిగి ఉంటారు. తరచుగా కుంభమేళా వంటి పండుగల సమయంలో వీరంత గుంపుగా కలిసి వస్తారు.

';

కుంభమేళా

అంతేకాదు పవిత్రమైన కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి వెళతారు. అంతేకాదు వారు ఎక్కడి నుంచి వస్తారో.. ఎక్కడికీ వెళతారో ఎవరికీ అంతు చిక్కదు. అది ఇప్పటీకీ ఓ మిస్టరీ అని చెప్పాలి.

';

VIEW ALL

Read Next Story