మహా కుంభ మేళా జరిగే ప్రయాగ్రాజ్లో సందర్శించాల్సిన దర్శనీయ ప్రదేశాలు ఇవే..
Mahakumbh Mela 2025: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 7 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించినట్టు సమాచారం.
ఇప్పటికే దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, ఆధ్యాత్మిక వేత్తలు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. దాదాపు 45 రోజులు పాటు ఈ ఆధ్యాత్మిక వేడుక జరగనుంది.
గంగా, యమునా, సరస్వతి వంటి పవిత్ర నదుల సంగమ ప్రదేశమై త్రివేణి సంగమ స్థలానికి దగ్గరలో దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూ కుటుంబ చారిత్రాత్మక నివాసం ఆనంద్ భవన్ ను సందర్శించవచ్చు.
ఆనంద్ భవన్ నెహ్రూ కుటుంబ చారిత్రాత్మక నివాసం. ఈ ఆనంద్ భవన్ లో భారతదేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటల గురించి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడే సమావేశమయ్యారు.
అలహాబాద్ ఫోర్ట్ ఖుస్రో బాగ్ ప్రశాంతమైన మొఘల్ ఉద్యానవన సముదాయం. ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది.
సరస్వతి కూప్.. అలహాబాద్ కోట లోపల ఉన్న పవిత్రమైన అంజూర చెట్టు, అక్షయ వట్ వృక్షం భక్తులు అత్యంత గౌరవ ప్రదంగా పూజిస్తారు. అక్షయ వట్ వృక్షం దగ్గర సరస్వతి కూప్ అనేది పౌరాణిక సరస్వతి నదికి మూలంగా భావించే పవిత్ర బావి.
చంద్ర శేఖర్ ఆజాద్ పార్క్ అనేది ప్రశాంతమైన పచ్చని ప్రదేశం.. ఇక్కడే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్.. దేశం కోసం బ్రిటిష్ వారి చేతిలో అమరుడయ్యారు.
ప్రయాగ్రాజ్ వాణిజ్యం, సంస్కృతి , నాగరికతతో పాటు కళాకృతులను ప్రదర్శించే పురావస్తు ప్రదేశం.