మీ ఇంట్లో కాని చీమలు ఎక్కువైపోతూ ఉంటే.. ఈ చిన్ని చిట్కాలను పాటించండి చాలు..
చీమలు ఎక్కువైపోతే చాలామంది చీమల మందు లేకపోతే కెమికల్స్ వాడుతూఉంటారు
కానీ ఇలా చేయడం వల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అది ప్రమాదానికి దారితీస్తుంది
అందుకే సహజసిద్ధిలో చీమలను ఎలా పోగొట్టాలో చూద్దాం
నిమ్మ తొక్కలను సన్నగా ముక్కలుగా చేసి.. పావు కప్పు గోరువెచ్చని నీరు వేసి బ్లెండ్ చేయండి. దీనిని వడపోసి చీమల ప్రాంతంలో స్ప్రే చేస్తే చీమలు పోతాయి.
ఒక స్ప్రే బాటిల్‌లో 1 1/4 కప్పుల నీరు పోసి అందులో కాస్టైల్ సబ్బు పోసి అందులోనే టేబుల్ స్పూన్ వేప నూనె వేయండి.
బాటిల్‌ని మూసి బాగా షేక్ చేసి ఈ స్ప్రేని చీమలు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయండి.
చీమలు తిరిగే ప్రాంతంలో ఎర్ర మిరపకాయలు, నల్ల మిరియాలు పెట్టిన అవి వెళ్ళిపోతాయి